ఫ్యామిలీ వీసా కోసం పే-స్లిప్ లో మానిపులేషన్..పలువురు ప్రవాసులకు నోటీసులు..!!
- May 29, 2025
కువైట్: కువైట్‌లో కుటుంబ వీసాలను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం అనేక మంది ప్రవాసులకు నోటీసులు జారీ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. చాలా మంది వ్యక్తులు KD 800 జీతం ఉందని, కుటుంబ వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. వారికి అనమతి ఇచ్చారు. అయితే, వీసాలు పొందిన తర్వాత, వారు అధికారికంగా తక్కువ జీతాలను పొందారు. తద్వారా మంత్రివర్గ నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించారని గుర్తించారు.
కుటుంబ వీసాలను పొందడానికి ఈ ప్రవాసులు KD 800 నెలవారీ ఆదాయాన్ని తెలిపే తప్పుడు సాలరీ సర్టిఫికేషన్ లను సమర్పించారని విచారణలో గుర్తించారు. కాగా, అధికారులు ఉల్లంఘించిన వారికి వారి నివాస స్థితిని సరిదిద్దుకోవడానికి లేదా వారి కుటుంబాలను స్వదేశానికి తిరిగి పంపించడానికి ఒక నెల గడువు ఇచ్చారు. సమన్లు పొందిన ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అధికారికంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని నిర్దేశించారు.
కుటుంబ పెద్ద తమ కుటుంబానికి మంచి జీవన ప్రమాణాలను అందించడానికి ఈ స్థాయి ఆదాయం అవసరమని సూచించే అధ్యయనాల ఆధారంగా KD 800 జీతం పరిమితిని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వివరించాయి. జాతీయత లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా, అందరూ ప్రవాసులు జీతం అవసరాలను తీర్చినట్లయితే, వారి కుటుంబాలను కువైట్‌కు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అనుమతిస్తుందని స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







