ఖతార్, మలేషియా వాణిజ్యం.. 80% వృద్ధి..!!
- May 29, 2025
దోహా, ఖతార్: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆసియాన్-జీసీసీ-చైనా ఆర్థిక వేదికలో ఖతార్ ఛాంబర్ పాల్గొంది. ఛాంబర్ ప్రతినిధి బృందానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెండవ వైస్ చైర్మన్ రషీద్ బిన్ హమద్ అల్-అత్బా నేతృత్వం వహించారు. బోర్డు సభ్యులు ఇంజినీర్ అలీ బిన్ అబ్దుల్ లతీఫ్ అల్-మిస్నాద్, నాసర్ బిన్ సులేమాన్ అల్-హైదర్ పాల్గొన్నారు. ఈ ఫోరమ్‌లో ఆసియాన్, జీసీసీ దేశాలలో పెట్టుబడులను పెంచడం, వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, ఇంధన రంగంలో వ్యూహాత్మక పెట్టుబడులను వేగవంతం చేయడంపై వర్కింగ్ సెషన్‌లను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖతార్ ఛాంబర్ రెండవ వైస్ చైర్మన్ రషీద్ బిన్ హమద్ అల్-అత్బా..బ్రూనై సుల్తానేట్ ఆర్థిక, ఆర్థిక మంత్రి హెచ్ ఇ దాటో అమిన్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. పరస్పర సహకార రంగాలు, బ్రూనై చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం మలేషియా పెట్టుబడి, వాణిజ్యం, పరిశ్రమల డిప్యూటీ మంత్రి లివ్ చిన్ టోంగ్‌తో అల్-అత్బా సమావేశమయ్యారు రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం, పెట్టుబడులు పెంచే మార్గాలపై సమీక్షించారు. అనంతరం ఫోరమ్ లో మాట్లాడుతూ.. ఖతార్, జిసిసి దేశాలలోని ప్రైవేట్ రంగం అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్)తో సహకారాన్ని బలోపేతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక ప్రాంతాలలో ఆసియాన్ ఒకటి అని పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో ఖతార్ కీలక వాణిజ్య భాగస్వాములలో మలేషియా ఒకటిగా ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం 2023లో QR2.9 బిలియన్లతో పోలిస్తే 2024లో QR5.2 బిలియన్లకు చేరుకుందని, ఇది 80% పెరుగుదలను నమోదు చేసిందని తెలిపారు. ఖతార్‌లోని వ్యాపార, పెట్టుబడి ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









