మిస్ వరల్డ్ 2025: నేడే హైటెక్స్ లో ఫైనల్
- May 31, 2025
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈసారి ఈ అంతర్జాతీయ సుందరీ పోటీకి హైదరాబాద్ గర్వంగా వేదికగా మారింది. హైటెక్స్‌లో ఇవాళ (మే 31) సాయంత్రం 6:30 నుంచి అర్ధరాత్రి వరకు ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. విశ్వసుందరి కిరీటం కోసం నాలుగు ఖండాలకు చెందిన 40 మంది అందగత్తెలు ఒకరితో ఒకరు పోటీపడనున్నారు.
ఇండియా తరఫున నందినీ గుప్తా రేసులో
ఈ భారీ పోటీలో భారత్ తరఫున నందినీ గుప్తా గెలుపు కోసం బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది నందినీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందినీ ఇప్పటికే కొన్ని రౌండ్లలో తన ప్రతిభను చాటుతూ చాలా మంది జ్యూరీలను ఆకట్టుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ భారత్‌కు రావాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు.
ప్రపంచ ప్రతినిధులతో హైదరాబాద్ మెరిసిపోతోంది
ఈ మెగా ఈవెంట్‌కు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరాంగనులతో పాటు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపార రంగ ప్రతినిధులు హాజరుకానున్నారు.అంతర్జాతీయ మీడియా ఈ వేడుకను ప్రత్యేకంగా కవర్ చేస్తోంది. ప్రపంచ దృష్టి ప్రస్తుతం హైదరాబాద్‌పై ఉండడంతో రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం కలగడం విశేషం.ఈ పోటీ ముగిసేలోపు కొత్త విశ్వసుందరిని ప్రకటించనుండగా, అందరూ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







