షార్జాలో అరుదైన అరేబియన్ మచ్చల డేగ గుడ్లగూబ పిల్లలు..!!

- June 02, 2025 , by Maagulf
షార్జాలో అరుదైన అరేబియన్ మచ్చల డేగ గుడ్లగూబ పిల్లలు..!!

యూఏఈ: కల్బా బర్డ్స్ ఆఫ్ ప్రే సెంటర్‌లో మూడు అరేబియన్ స్పాటెడ్ ఈగిల్ గుడ్లగూబ పిల్లలు పొదిగినట్లు షార్జా పర్యావరణ, రక్షిత ప్రాంతాల అథారిటీ ప్రకటించింది. ఈ గుడ్లగూబ జాతిని మొదటిసారిగా 2003లో యూఏఈ లో గుర్తించారు. దిబ్బా పర్వతాల్లో దొరికిన వాటిని ఒక దాత దుబాయ్ జూకు బహుమతిగా అందజేశాడు.

ఇదే కుటుంబానికి చెందిన అరేబియన్ ఈగిల్ గుడ్లగూబ (బుబో ఆఫ్రికానస్ మిలేసి) మొదటిసారిగా 2017లో ఫుజైరాలోని హజర్ పర్వతాలలో కనుగొన్నారు. టెరెస్ట్రియల్ బయోడైవర్శిటీ మేనేజర్, సైంటిఫిక్ అడ్వైజర్ జాకీ జుడాస్ మాట్లాడుతూ.. ఇక్కడి ఎడారులు, పర్వత ప్రాంతాలలో అనేక రకాల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక వినూత్నమైన జాతులు వృద్ధి చెందుతాయని అన్నారు. దురదృష్టవశాత్తు వేగవంతమైన అభివృద్ధి..ఈ జీవులలో చాలా వాటికి పెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న జాతులను రక్షించే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు తెలిపారు. 45 సెం.మీ ఎత్తు, 600 నుండి 800 గ్రాముల బరువున్న ఒక పెద్ద పక్షి ఉంటుందని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com