యూఏఈలో పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఆందోళనలు..!!
- June 03, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కొన్ని మెడికల్ కేంద్రాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసుల పెరుగుదల నమోదవుతున్నాయి. ఇది కాలానుగుణంగా ఉండేదే అని డాక్టర్లు చెబుతున్నారు. వేసవి నెలల్లో ఆహారాన్ని పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. “వేసవి కాలంలో ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది” అని మెడ్కేర్ రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉన్ని రాజశేఖరన్ నాయర్ అన్నారు. “మా అవుట్ పేషెంట్ విభాగం, అత్యవసర విభాగాలలో వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు తిమ్మిరి వంటి ఫిర్యాదులు తరచుగా కాలానుగుణంగా పెరుగుతాయి. వీటికి ఆహార కాలుష్యం కారణం.” అని తెలిపారు.
షార్జాలోని బుహైరా కార్నిచేలోని NMC మెడికల్ సెంటర్ నుండి ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సల్మా ఖానం పటాన్ మాట్లాడుతూ.. “ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించినందున ప్రతి వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరగడం సర్వసాధారణం.” అని పేర్కొన్నారు.
మే నెలలో యూఏఈలో ఉష్ణోగ్రతలు 51.6°C కి చేరుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇది ఒకటిగా తెలిపారు. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, నిపుణులు ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నివాసితులను హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టెరియా వంటి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుందని డాక్టర్ రోహిత్ అన్నారు. ముఖ్యంగా ఆహారాన్ని నిల్వ చేయనప్పుడు ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందన్నారు.
అజ్మాలోని మెట్రో మెడికల్ సెంటర్లో పిల్లల వైద్యుడు డాక్టర్ జమాలుద్దీన్ అబుబకర్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో పిల్లలలో ఫుడ్ పాయిజనింగ్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. “4°C -60°C మధ్య ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా వేగంగా పెరిగేందుకు అనుకూలంగా ఉంటాయి.” అని ఆయన అన్నారు. ఇంట్లో వంట చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సల్మా అన్నారు. వంట చేసే ముందు, పచ్చి మాంసం లేదా పౌల్ట్రీ ఉత్పత్తులను తాకిన తర్వాత వారు చేతులు బాగా కడుక్కోవాలని సూచించారు. మిగిలిన వాటిని వెంటనే రిఫ్రిజిరేటర్లో పెట్టడం, గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకు మించి ఆహారాన్ని ఉంచకూడదని అని అన్నారు.
ప్యాకింగ్ ఫుడ్ పట్ల జాగ్రత్త
దుబాయ్‌కు చెందిన ఆహార భద్రతా నిపుణుడు బాబీ కృష్ణ ప్రకారం.. షాపింగ్, ప్యాకింగ్‌తో సహా ఆహార ఉత్పత్తుల పట్ల అన్ని దశలలో జాగ్రత్త తీసుకోవాలి. ఫ్యాకింగ్ ఫుడ్ ని చల్లగా ఉంచకపోతే ఒక గంటలోపు తినాలని ఆయన అన్నారు. ముఖ్యంగా షాపింగ్ చేసేటప్పుడు, రిఫ్రిజిరేటర్ నుండి సమయం తగ్గించడానికి మాంసం, పాల ఉత్పత్తులు, సలాడ్లు వంటి వస్తువులను స్టోర్ నుండి తీసుకోవాలని, షాపింగ్ తర్వాత, నేరుగా ఇంటికి వెళ్లి వెంటనే రిఫ్రిజిరేటర్లో పెట్టాలని సూచించారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!