ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- October 08, 2025
రియాద్: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై తీసుకున్న చర్యలను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
సెషన్ తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను, ముఖ్యంగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితిని కేబినెట్ చర్చించిందని చెప్పారు. సౌదీ అరేబియా నిర్వహించే అన్ని అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను కౌన్సిల్ సమీక్షించిందని తెలిపారు.
ఇటీవల అల్-ఉలాలో జరిగిన మ్యూనిచ్ భద్రతా సదస్సు సమావేశాన్ని విజయవంతం చేసిన వారిని కేబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ ఆహార భద్రత, వాతావరణం మరియు ఇంధన సమస్యలు, అంతర్జాతీయ వాణిజ్యం , ఆర్థిక సహకారంపై అభిప్రాయాలను షేర్ చేసుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!