ఇండియా, చైనీస్ శానిటరీ వేర్‌పై 83.4% యాంటి డంపింగ్ డ్యూటీ..!!

- June 04, 2025 , by Maagulf
ఇండియా, చైనీస్ శానిటరీ వేర్‌పై 83.4% యాంటి డంపింగ్ డ్యూటీ..!!

కువైట్: ఇండియా, చైనా నుండి వచ్చే శానిటరీ వేర్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధిస్తూ కువైట్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఫాతిమా అల్ కల్లాఫ్ కొత్త కస్టమ్స్ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త టారిఫ్ రేట్లు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపింది.  

2025 కస్టమ్స్ ఇన్‌స్ట్రక్షన్ నంబర్ 25 కింద జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల ద్వారా కువైట్‌లోకి ప్రవేశించే దిగుమతులకు వర్తిస్తుంది. ఇది ప్రత్యేకంగా వాష్‌బేసిన్‌లు, బాత్‌టబ్‌లు, బిడెట్‌లు, టాయిలెట్ సీట్లు, ఫ్లష్ ట్యాంకులు, యూరినల్స్, పింగాణీతో తయారు చేసిన ఇలాంటి స్థిర శానిటరీ వస్తువులు వంటి ఉత్పత్తులు ఈ టారిఫ్ కింద ఉన్నాయి.  

ప్రస్తుత కస్టమ్స్ సుంకాలకు అదనంగా యాంటీ-డంపింగ్ సుంకాలు విధించబడతాయి. వస్తువుల CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ ఆధారంగా లెక్కిస్తారు. దర్యాప్తులో గుర్తించబడిన డంపింగ్ మార్జిన్లు చైనా కంపెనీలకు 33.8% నుండి 51% వరకు, భారతీయ కంపెనీలకు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపారు. కువైట్ తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  ఈ సుంకాలు జూలై 8 నుండి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com