కఠినమైన వీసా నిబంధనలు.. యూఏఈ నివాసితులపై జార్జియా నిషేధం..!!
- June 06, 2025
యూఏఈ: జార్జియా కఠినమైన వీసా నిబంధనలను అమలు చేస్తుంది. యూఏఈ నివాసితులు సహా నిర్దిష్ట జాతీయులకు వీసా నిబంధనలను కఠినతరం చేసింది. సవరించిన నియమాల ప్రకారం.. పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు సహా అనేక దేశాల పౌరులను ప్రభావితం చేస్తున్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి చెల్లుబాటు అయ్యే వీసాలు లేదా నివాస అనుమతులను కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని దేశాల పౌరులకు ప్రవేశాన్ని నిరాకరిస్తుంది.
యూఏఈ నివాసి, 31 ఏళ్ల సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ ముహమ్మద్ జార్జియా నిర్ణయం ఆశ్చర్యపరిచిందని తెలిపారు. అతను, అతని స్నేహితుడు ఈద్ అల్ అధా సెలవుల కోసం కుటైసి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.. వారు అబుదాబి నుండి విజ్ ఎయిర్ విమానంలో ప్రయాణించారు. "మా దగ్గర అవసరమైన అన్ని పత్రాలు, యూఏఈ నివాస రుజువు, హోటల్ బుకింగ్‌లు, రిటర్న్ టిక్కెట్లు, ప్రయాణ బీమా ఉన్నాయి. కొంతమంది ప్రయాణీకులను విమానం ఎక్కే ముందు ఆపారు. కానీ మాకు విమానంలో ప్రయాణించడానికి అనుమతి లభించింది." అని పాకిస్తాన్ ప్రవాసియైన ముహమ్మద్ అన్నారు. "మమ్మల్ని పక్కకు తీసుకెళ్లారు. మా పాస్‌పోర్ట్‌లు తీసుకున్నారు, ఇతర ప్రయాణీకుల ముందు మా ఫోటోలు తీసుకున్నారు." అని ముహమ్మద్ గుర్తుచేసుకున్నాడు. "ఒక మహిళా అధికారి మాకు ప్రవేశ తిరస్కరణ పత్రాలను అందజేసే వరకు మాకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.”
ముహమ్మద్ ఇప్పుడు ఇతరులను, ముఖ్యంగా పాకిస్తాన్ పాస్‌పోర్ట్ హోల్డర్లను, జార్జియాకు ప్రయాణ ప్రణాళికలను రివైజ్ చేసుకోవాలని సూచించారు.
గల్ఫ్ రెసిడెన్సీ ఇకపై ఆటో మేటిక్ గా వీసా రహిత ఎంట్రీ ని మంజూరు చేయదని తెలిపారు. అయితే, గతంలో కొన్ని దేశాల పౌరులు GCC సభ్య దేశాల నుండి చెల్లుబాటు అయ్యే వీసాలు లేదా నివాస అనుమతులను కలిగి ఉంటే వీసా లేకుండా జార్జియాలోకి ప్రవేశించవచ్చు. అయితే, మునుపటి నిబంధన ఆ వీసాలు లేదా అనుమతులకు కనీస చెల్లుబాటు వ్యవధిని పేర్కొనలేదు. ఏప్రిల్ 17, 2025 నాటికి, ఇది మారిపోయింది. గల్ఫ్ దేశాలు జారీ చేసిన మల్టీ-ప్రవేశ వీసాలు లేదా నివాస అనుమతులను కలిగి ఉన్న నిర్దేశిత దేశాల పౌరులు ఇప్పుడు జార్జియన్ వీసా లేకుండా జార్జియాలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని, వారి వీసా లేదా పర్మిట్ ప్రవేశించిన రోజున కనీసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటేనే.. ఈ చెల్లుబాటును పాస్‌పోర్ట్ లేదా ఇతర సంబంధిత డాక్యుమెంటేషన్ ద్వారా స్పష్టంగా చూపించాలని.. దాంతో
కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, కొంతమంది నివాసితులను జార్జియన్ ఇమ్మిగ్రేషన్ వద్ద నిలిపివేసినట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
ఈ పరిమితి ప్రత్యేకంగా ఈ క్రింది దేశాల జాతీయులకు వర్తిస్తుంది:
పాకిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్
బంగ్లాదేశ్
ఘనా
ఇథియోపియా
ఎరిట్రియా
యెమెన్
కామెరూన్
కోట్ డి'ఐవోయిర్
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్
మొరాకో
నైజీరియా
సోమాలియా
సిరియా
సూడాన్
టాంజానియా
ఉగాండా
గల్ఫ్ దేశం నుండి స్వల్పకాలిక వీసా లేదా నివాస అనుమతిని కలిగి ఉండటం వల్ల ఈ వ్యక్తులకు ఇకపై జార్జియాకు వీసా-రహిత ప్రవేశం లభించదు. గల్ఫ్ జారీ చేసిన వీసా లేదా పర్మిట్‌పై కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటు ఉన్నవారు మాత్రమే వీసా-రహిత ప్రవేశానికి అర్హులు అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!