'డకాయిట్' జూన్ 8 నుంచి క్రూషియల్ షెడ్యూల్ ప్రారంభం
- June 06, 2025
అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ 'డకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డకాయిట్ కోసం డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబధించిన ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే టీం జూన్ 8 నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్ ని ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం ఈ క్రిస్మస్, డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది. ఈ హాలిడే బాక్సాఫీస్ ను షేక్ చేస్తొందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. శేష్‌కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







