ముజ్దలిఫాలో కొత్త హజ్ కమాండ్ సెంటర్ ప్రారంభం..!!

- June 09, 2025 , by Maagulf
ముజ్దలిఫాలో కొత్త హజ్ కమాండ్ సెంటర్ ప్రారంభం..!!

మక్కా: సౌదీ అరేబియా అంతర్గత మంత్రి, సుప్రీం హజ్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్..  ముజ్దలిఫాలో ముజాహిదీన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌తో అనుబంధంగా ఉన్న హజ్ , ఉమ్రా మిషన్ల కోసం జనరల్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రిన్స్ అబ్దులాజీజ్ తాజా సాంకేతిక, భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త సౌకర్యంపై ఒక ప్రజెంటేషన్‌ను వీక్షించారు. ఈ అప్డేట్ లు ముజాహిదీన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, ఫీల్డ్ బృందాలు అత్యున్నత స్థాయి సామర్థ్యం, వృత్తి నైపుణ్యంతో యాత్రికులకు సేవలందించడానికి వీలు కల్పిస్తాయి.

అంతకుముందురోజు మంత్రి మక్కా నగరంలోని రాయల్ కమిషన్ జనరల్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ మరియు అరాఫత్‌లోని పవిత్ర స్థలాలను సందర్శించారు. ఆయనకు రవాణా, లాజిస్టిక్ సేవల మంత్రి, రవాణా జనరల్ అథారిటీ (TGA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సలేహ్ అల్-జాసర్ స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రిన్స్ అబ్దులాజీజ్ ఈ సంవత్సరం హజ్ సీజన్‌లో రవాణా వ్యవస్థ కార్యకలాపాలను వివరించారు.   తష్రీక్ రోజులలో మినా, గ్రాండ్ మసీదు మధ్య యాత్రికుల సేవా మార్గాల ఇంటరాక్టివ్ మ్యాప్‌ను కూడా అంతర్గత మంత్రి సమీక్షించారు.  ఇది షటిల్ రవాణాను నియంత్రిస్తుందని, ప్రతి మార్గానికి మూసివేత సమయాలను నిర్దేశిస్తుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com