దుబాయ్ స్టాక్ మార్కెట్ నుండి ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ డీలిస్ట్..!!
- June 09, 2025
యూఏఈ: ఎమిరేట్స్ NBD తన అన్ని షేర్లను కొనుగోలు చేసిన తర్వాత దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ (DFM) నుండి డీలిస్ట్ చేయనున్నట్లు ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ (EIB) తెలిపింది. "జూన్ 10 నుండి అమలులోకి వచ్చేలా దాని షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేయాలని, మిగిలిన అన్ని EIB షేర్లు (ENBD వద్ద లేనివి) జూన్ 31న లేదా ఆ తర్వాత EIB షేర్ రిజిస్టర్లో ఎమిరేట్స్ NBD పేరుతో తిరిగి నమోదు చేయబడతాయని" DFMకి ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఎమిరేట్స్ ఇస్లామిక్ నికర లాభం 2025 మొదటి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో Dh1 బిలియన్లకు పెరిగింది. ఇది 24 శాతం కావడం గమనార్హం.
2024లో ఇది పన్నుకు ముందు Dh3.1 బిలియన్ల రికార్డు లాభాన్ని ఆర్జించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 46 శాతం పెరుగుదల అని తెలిపింది. నికర లాభం కూడా రికార్డు స్థాయిలో Dh2.8 బిలియన్లకు చేరుకుందని, ఇది 32 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







