నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- June 10, 2025
విజయవాడ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో ఉద్యోగాలను భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 117 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.aiimsmangalagiri.edu.inద్వారా అప్లై చేసుకోవచ్చు
విద్యార్హత: ఉద్యోగ విభాగాలను బట్టి ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంఫిల్, ఎంఎస్సీ, ఎంసీహెచ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయోపరిమితి: ఈ పోస్టుల కోసం అప్లై చేసుకుంటున్న అభ్యర్థుల వయసు 45 సంవంత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.1000.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,000 జీతం ఉంటుంది.నాన్ మెడికల్ వారికి రూ.56,100 జీతం.
ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!