కెన్యా: లోయలో పడిన బస్సు...ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం
- June 10, 2025
నైరోబి: కెన్యాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖతర్‌లో నివాసముంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు.ఈ విషయాన్ని ఖతర్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది.
ప్రమాద సమయంలో వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన నిమిత్తం కెన్యాలో ఉన్నారు ..మొత్తం 28 మంది ప్రవాస భారతీయులు ఒక బస్సులో ప్రయాణిస్తుండగా.. వారి వాహనం ప్రమాదవశాత్తూ లోయలోకి పడిపోయింది
ఈ ఘటన నైరోబికి సమీపంలోని పర్యాటక ప్రదేశం వద్ద జరిగింది. ప్రమాదానికి గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిందా? లేక మరే ఇతర వాహనం ఢీ కొట్టిందా ? అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇక ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయినట్టు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వారు నైరోబిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ దుర్ఘటన పై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ఘటన స్థలానికి నైరోబిలోని భారత రాయబార కార్యాలయ అధికారులు చేరుకున్నారని స్పష్టం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని.. స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటించారు. గాయపడినవారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!