#Mega157 రెండవ షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం
- June 11, 2025
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో #Mega157తో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ఇప్పటికే ముగించింది టీమ్. ఈ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొన్నారు. రషెస్ అద్భుతంగా ఉన్నాయి. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్.
మెగా157 రెండవ షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. ఈ 10 రోజుల షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్, తదితరులు ప్రధాన తారాగణం పాల్గొంటారు. చిత్ర బృందం కొన్ని కీలకమైన, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ తర్వాత నయనతార చిరుతో కలిసి మూడోసారి నటించనుంది.
మెగాస్టార్ చిరంజీవి ఒక స్కూల్ గ్రౌండ్ లో టేబుల్ మీద కూర్చోని వుండగా, పిల్లలు తనవైపు పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆయన థంబ్స్ అప్ ఇస్తూ ప్రజెంట్ చేసిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ విజువల్ చాలా ప్లజెంట్ గా వుంది. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం మరింత జాయ్ ని యాడ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది.
ఇటీవల వచ్చిన ఫెస్టివల్ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన ట్రేడ్‌మార్క్, క్రియేట్ ప్రమోషన్స్ తో #Mega157పై ఇప్పటికే ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
అడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
పీఆర్వో - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!







