'8 వసంతాలు' సోల్ ఫుల్ సెకండ్ సింగిల్ పరిచయమిలా సాంగ్ రిలీజ్
- June 11, 2025
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ 'అందమా అందమా' చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు సెకండ్ సింగిల్ పరిచయమిలా సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
సోల్ ఫుల్ నెంబర్స్ కి పాపులరైన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఒక బ్యూటీఫుల్ మెలోడీగా స్వరపరిచారు. వనమాలి రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. వెటరన్ సింగర్ కేఎస్ మెలోడీస్ వాయిస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఆమె మాగ్నటిక్ వాయిస్ తో సాంగ్ నెక్స్ట్ కి వెళ్ళింది. సాంగ్ లో విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి.
నవీన్ యెర్నేని,వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైన్‌ను, శశాంక్ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతమైన కథనంతో ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







