ఎన్‌ఓఎల్ కార్డుతో మినీ పేమెంట్స్
- July 13, 2016
ఎన్‌ఓఎల్ కార్డులతో మినీ పేమెంట్స్ చేసుకునేందుకు ఈఈలుగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), స్మార్ట్ దుబాయ్ ఆఫీస్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ మరియు డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్, స్మార్ట్ దుబాయ్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా బినంట్ బుట్టి ఈ మేరకు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. పలువురు సిఇఓలు, డైరెక్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్ రెసిడెంట్స్ ఇకపై ఎన్‌ఓల్ కార్డుల ద్వారా మినీ పేమెంట్స్ చేసుకోడానికి వీలుంటుంది. ఏయే విభాగాల్లో వారికి ఈ అవకాశాలు కల్పించాలి, ప్రాధమికంగా పేమెంట్స్ కోసం ఎంత ఛార్జ్ చేయాలి? అనేదానిపై త్వరలోనే మార్గదర్శకాలు వెల్లడవుతాయి. ఎన్‌ఓఎల్ స్మార్ట్ పేమెంట్స్‌తో దుబాయ్ వాసులకు మరింత మెరుగైన సౌకర్యాలు, శ్రమలేకుండా అందుతాయనీ, ఈ స్మార్ట్ సేవ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టిఎ, స్మార్ట్ దుబాయ్ ఆఫీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







