సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!

- June 13, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!

రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సౌదీ ప్రాంతాలైన తబుక్, జాజాన్, అసిర్, నజ్రాన్, మక్కా, మదీనా,  తూర్పు ప్రావిన్స్ అంతటా ప్రధాన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా 2,756,806 యాంఫేటమిన్ పిల్స్ , నాలుగు టన్నుల హషీష్, 180 టన్నుల ఖాట్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి 2,411 మంది వ్యక్తులను అరెస్టు చేశారని, వారిలో 1,518 మంది ఇథియోపియన్ జాతీయులు; 842 మంది యెమెన్లు; ఏడుగురు సూడాన్లు; ఆరుగురు ఎరిట్రియన్లు; ముగ్గురు సోమాలిలు; ఇద్దరు పాకిస్తానీలు,  33 మంది సౌదీ పౌరులు ఉన్నారని వెల్లడించారు. ఇది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్‌లో భాగంగా..యువత భద్రతను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్లు తెలిపింది. ఏదైనా సమాచారాన్ని మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని 911 నంబర్‌కు లేదా ఇతర ప్రాంతాలలో 999 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ నంబర్ 994, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ నంబర్ 995 లేదా [email protected] కు ఇమెయిల్ చేయడం ద్వారా తెలియజేయాలని సూచించింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com