ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు

- June 13, 2025 , by Maagulf
ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు

హైద‌రాబాద్: ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేది ఉద‌యం 10 గంట‌ల‌కు హాజ‌రుకావాల‌ని ఆ నోటీస్ లో పేర్కొన్నారు.కాగా, ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే ఇటీవ‌లే ఎసిబి కెటిఆర్ కు విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీస్ పంపింది.. ఈ సంద‌ర్భంగా ఈ నోటీస్ కు కెటిఆర్ జ‌వాబిస్తూ విదేశాల‌లో ముంద‌స్తు కార్య‌క్ర‌మాలు ఉండ‌టంతో విచార‌ణ‌కు రాలేక‌పోతున్నాన‌ని వివ‌రించారు.. మ‌రో తేదిని కేటాయించ‌వ‌ల‌సిందిగా కోరారు..ఈ నేప‌థ్యంలో నేడు కొత్త‌గా నోటీస్ జారీ చేసింది ఎసిబి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com