బాహుబలి 2 కొత్త తరహాలో ప్రచారం
- July 13, 2016
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి.. మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి భాగంతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలి టీం, ఇప్పుడు రెండో భాగం కోసం మరింత భారీగా రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.తొలి భాగం ఘనవిజయం సాధించటంతో బాహుబలి పార్ట్ 2 మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండటంతో ఈ హైప్ ఇలాగే కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా. అందుకే హాలీవుడ్ తరహాలో సినిమా క్యారెక్టర్స్ తో బొమ్మలు, వీడియో గేమ్ లు రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. హలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







