ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట…త్రిసభ్య కమిటీ ఏర్పాటు!
- June 15, 2025
ముంబై: ఆర్సీబీ విజయం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.భవిష్యత్లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో, అవసరమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించేందుకు బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా సభ్యులుగా ఉన్నారు.
ఈ ఘటనపై బోర్డు ఒక ప్రకటన విడుదల చేస్తూ, “బెంగళూరులో జరిగిన తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం.అందుకే కమిటీ ఏర్పాటుచేశాం.త్వరలోనే కమిటీ తగిన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేస్తుంది” అని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







