భారత ప్రధానికి లెటర్ రాసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- June 15, 2025
జెడ్డా: భారత్ లో జరిగిన విషాదకర విమాన ప్రమాదంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక కేబుల్ పంపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.
జూన్ 12( గురువారం) అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే సమీపంలోని మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 241 మందితోపాటు భవనం సమీపంలోని 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక ప్రయాణీకుడు గాయాలతో బయటపడటం గమనార్హం.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







