ఒమన్ లో ఉపాధి, క్రీడలు, టూరిజంపై ప్రజాభిప్రాయ సేకరణ..!!

- June 15, 2025 , by Maagulf
ఒమన్ లో ఉపాధి, క్రీడలు, టూరిజంపై ప్రజాభిప్రాయ సేకరణ..!!

మస్కట్: ఉపాధి, సామాజిక రక్షణ, క్రీడలు, వినోదంపై దృష్టి సారించి.. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నేటి నుంచి ప్రజాభిప్రాయ సర్వేను ప్రారంభించనుంది. సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా విధాన నిర్ణయం తీసుకునే ప్రక్రియలకు మద్దతు ఇచ్చే ఖచ్చితమైన డేటాను రూపొందించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చేపడుతున్న ఈ సర్వే జూన్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు.

కార్మిక రంగంపై ఒమానీల అభిప్రాయాలను అంచనా వేయడం, క్రీడా భాగస్వామ్యం, వినోద కార్యకలాపాలలో ధోరణులను పర్యవేక్షించడం ఈ సర్వే లక్ష్యం అని NCSIలోని సమాచార నివేదికల విభాగం డైరెక్టర్ సాదా బింట్ అబ్దుల్లా అల్-మావాలి పేర్కొన్నారు.  అలాగే సుల్తానేట్ గవర్నరేట్‌ల అంతటా పర్యాటక సేవలతో ప్రజల సంతృప్తిని అంచనా వేయడానికి కూడా సర్వే చేస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఒమానీ పౌరుల నుంచి అభిప్రాయలను సేకరించనున్నారు.  అందరూ పాల్గొనాలని, తమ అభిప్రాయాలను నిష్పాక్షికంగా పంచుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఇన్‌పుట్ ప్రజలకు అందించే సేవలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి నేరుగా దోహదపడుతుందని తెలిపారు.

కాగా, రాయల్ డిక్రీ నంబర్ 55/2019 ప్రకారం.. సేకరించిన సమాచారాన్ని గోప్యతతో పరిగణిస్తామని అల్-మావలి పునరుద్ఘాటించారు. డిక్రీలోని ఆర్టికల్ (11) ప్రకారం.. వ్యక్తిగత గణాంక డేటా గోప్యంగా ఉంటుందని, సమగ్ర అభివృద్ధి ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com