యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులకు హిజ్రీ నూతన సంవత్సర సెలవు..!!
- June 17, 2025
యూఏఈః ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించారు. జూన్ 27 (శుక్రవారం) ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఇది హిజ్రీ సంవత్సరం 1447 AH ప్రారంభాన్ని సూచిస్తుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) ప్రకటన ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తిస్తుంది.అలాగే వారికి 3 రోజుల లాంగ్ వీకెండ్ వస్తుంది. సాధారణ పని గంటలు జూన్ 30, సోమవారం నుండి తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
ఇస్లామిక్ లేదా హిజ్రీ క్యాలెండర్ చంద్ర నెలలపై ఆధారపడి ఉంటుంది. నూతన సంవత్సరం క్యాలెండర్ మొదటి నెల అయిన ముహర్రం మొదటి రోజున ప్రారంభమవుతుంది. యూఏఈ క్యాబినెట్ జారీ చేసిన 2025 అధికారిక సెలవుల జాబితాకు అనుగుణంగా ఈ తేదీని నిర్ధారించారు. ఈద్ అల్ అధా సెలవుల సమయంలో నివాసితులు ఆస్వాదించిన లాంగ్ వీకెండ్ తర్వాత హిజ్రీ నూతన సంవత్సర సెలవుదినం వస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







