ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు..

- June 18, 2025 , by Maagulf
ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు..

ఇజ్రాయల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. పరస్పరం బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ అలర్ట్ అయ్యింది. ఇరాన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు “ఆపరేషన్ సింధు”ను ప్రారంభించింది కేంద్రం. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం అట్టుడుకుతున్న నేపథ్యంలో పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఆపరేషన్ సింధులో భాగంగా తొలి విడతలో ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియాకు చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారంతా అర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం భారత్ కు బయలుదేరారు. ఈ విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంటుంది.

విద్యార్థులను తొలుత ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం సరిహద్దులు దాటించి అర్మేనియాకు చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వారిని స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది కేంద్రం.

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లోని భారత పౌరుల భద్రత తమ అత్యంత ప్రాధాన్యతా అంశాల్లో ఒకటని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ అక్కడి హై-రిస్క్ జోన్లలో ఉన్న భారతీయులను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిత్యం సంప్రదింపులు సాగించాలని అక్కడి భారతీయులను కేంద్రం కోరింది. ఇందుకోసం అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 24×7 కంట్రోల్ రూమ్‌తో సంప్రదింపులు జరపాలంది.

ఇరాన్ లో భారత ఎంబసీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు..
For call only : +98 9128109115, +98 9128109109
WhatsApp: +98 901044557, +98 9015993320, +91 8086871709
Bandar Abbas: +98 9177699036
Zahedan: +98 9396356649
Email- [email protected]

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com