యూకేసిటి సదస్సుకు డా.లక్ష్మీకాంతం
- June 19, 2025
హైదరాబాద్: యునైటెడ్ కింగ్డమ్ కమ్యూనిటీ ఫర్ తెలుగు(యూకేసిటి) 7వ వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా టిటిడి జెఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.బి.లక్ష్మీకాంతంకు ఆహ్వానం అందింది.ఈ ఏడాది జూన్ 29న యునైటెడ్ కింగ్డఓంలోని జేఎఫ్ఎస్ స్కూల్ కమ్యూనిటీ గ్యాధరింగ్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా ఆయనను నిర్వాహకులు ఆహ్వానించారు.
యూకేలో నివసిస్తున్న తెలుగు కమ్యూనిటీ సభ్యులకు సహాయపడడంతో పాటు సేవ కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా 2018లో యూకేసిటి స్థాపించబడింది.వ్యాపారం,సాంస్కృతికం,ఆధ్యాత్మికం,దానధర్మ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సభ్యుల పురోగతికి ఈ సంస్థ తోడ్పడుతోంది.యూకేసిటి వాసర్షికోత్సవాన్ని గతకాలంలో చేసిన కార్యక్రమాల సమీక్షా అందరూ కలిసి ఆనందం పంచుకోవడం కమ్యూనిటీ సభ్యుల కృషి విజయాలను గుర్చించడంతో పాటు ఐక్యత సమగ్రతే బలమని నమ్మి ముందుకుసాగడం ఈ వార్షికోత్సవ ఉద్దేశం. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భిన్న నేపధ్యాల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి పనిచేసేక్రమంలో డా.లక్ష్మీకాంతం లాంటివారు ఎంతో ప్రేరణగా నిలిచారని మరిన్ని విజయాలు సాధించడానికి తోడ్పాటు నిచ్చారని గతంలోనూ యూకేసిటికి స్నేహితుడిగా మద్దతుదారుగా ఉంది అవసరమైనప్పుడు మార్గనిర్దేశనం చేశారనిగత సంవత్సరం యూకేసిటి బిజినెస్ బూస్ట్ కనెక్ట్(బీబీసీ) సమావేశంలో ప్రసంగించిన సందర్భాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు
- ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్
- హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్
- APEX కౌన్సిల్ సభ్యుడిగా తొలి తెలుగు వ్యక్తి చముందేశ్వరనాథ్ ఎన్నిక