అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్
- October 17, 2025
అమెరికా: అమెరికాలో దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రతి ఏడాది ఎంతో వైభవంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అమెరికా రాజకీయ నాయకులు, మేయర్లు, రాష్ట్ర గవర్నర్లు పాల్గొని, ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.అమెరికా అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను వారు ప్రత్యేకంగా గుర్తించి, ప్రశంసలతో అభినందిస్తారు.
న్యూయార్క్ నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించబడ్డాయి. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన అధికారిక నివాస స్థలమైన గ్రేసీ మాన్షన్‌లో దీపావళి వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మేయర్ మాట్లాడుతూ, న్యూయార్క్ నగర సాంస్కృతిక, ఆర్థిక ప్రగతిలో భారతీయ సమాజం నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు ఎరిక్ ఆడమ్స్ (Eric Adams).
భారత కాన్సులేట్ జనరల్ తరఫున ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కాన్సుల్ జనరల్ విశాల్ జయేష్‌భాయ్ హర్ష్.. వెలుగు, ఆశ, ఆనందానికి ప్రతీకైన దీపావళి సందేశాన్ని అందరికీ తెలియజేశారు.మరోవైపు న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ఫ్లషింగ్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రవాస భారతీయులకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు గవర్నర్‌కు కాన్సులేట్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఫ్లోరిడాలోని టల్లాహస్సీలో ఉన్న ఫ్లోరిడా క్యాపిటల్‌లో మొట్టమొదటిసారిగా దీపావళి సంబరాలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర అధికారులు, ప్రవాస భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







