అమితాబ్‌ బచ్చన్‌ని ప్రకాశ్‌రాజ్‌ కలిశారట..

- July 13, 2016 , by Maagulf
అమితాబ్‌ బచ్చన్‌ని  ప్రకాశ్‌రాజ్‌ కలిశారట..

బాలీవుడ్‌ షహెన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ని దక్షిణాది నటుడు ప్రకాశ్‌రాజ్‌ కలిశారట. లెజెండ్‌ని ఆయన నివాసానికి వెళ్లి కలిశానని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమితాబ్‌ చూపించిన ప్రేమాప్యాయతలకు ప్రకాశ్‌రాజ్‌ పొంగిపోయారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్‌రాజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కానీ అమితాబ్‌ను కలవడానికి గల కారణాన్ని ప్రకాశ్‌రాజ్‌ చెప్పలేదు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌ తాను నటిస్తూ.. నిర్మిస్తున్న 'మన వూరి రామాయణం' చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com