బిగ్ టికెట్ డ్రాలో Dh150,000 గెలిచిన కేరళ పిషర్ మ్యాన్..!!

- June 20, 2025 , by Maagulf
బిగ్ టికెట్ డ్రాలో Dh150,000 గెలిచిన కేరళ పిషర్ మ్యాన్..!!

యూఏఈ: బిగ్ టికెట్ తాజా డ్రాలో ముగ్గురు భారతీయ ప్రవాసులు ఒక్కొక్కరు Dh150,000 గెలుచుకున్నారు. 39 ఏళ్ల సుల్ఫీకర్ పక్కర్కాంటే పురక్కల్ బషీర్ పక్కర్కాంటే..భారత లోని కేరళకు చెందిన మత్స్యకారుడు.  గత 10 సంవత్సరాలుగా అబుదాబిలో ఉంటున్నాడు.  మిగిలిన ఇద్దరు విజేతలు 45 ఏళ్ల సెల్వా జాన్సన్,  29 ఏళ్ల ఎల్డో థోంబ్రాయిల్.
సుల్ఫీకర్ గత మూడు సంవత్సరాలుగా 12 మంది స్నేహితుల బృందంతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ వారం అతనికి  అదృష్టం వరించింది. అతను బహుమతి డబ్బును తన స్నేహితులలో సమానంగా పంచుకోవాలని యోచిస్తున్నాడు.
మరో అబుదాబి నివాసి సెల్వా జాన్సన్ గత 24 సంవత్సరాలుగా యూఏఈలో ఉంటున్నాడు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నెలా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాడు. బిగ్ టికెట్‌ను వెబ్‌సైట్ ద్వారా కొన్న సెల్వా.. 10 మంది స్నేహితుల బృందంలో భాగంగా టిక్కెట్టు కొన్నానని తెలిపాడు.
ఎల్డో థోంబ్రాయిల్.. రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వచ్చాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాడు. 17 మంది స్నేహితుల బృందంలో భాగంగా ఆడుతున్న ఎల్డో.. బహుమతిని పంచుకుంటామని తెలిపారు.  
ఈ నెలలో పాల్గొనేవారు Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్, మూడు Dh150,000 వారపు ఇ-డ్రాలు, ది బిగ్ విన్ కాంటెస్ట్  విజేతలుగా నిలుస్తారు. జూలై 3న లైవ్ డ్రా సమయంలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్, అదే రోజు, ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి Dh75,000 కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com