రియాద్ ఎక్స్పో 2030 కోసం కొత్త కంపెనీ ప్రారంభం..!!
- June 20, 2025
రియాద్: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF).. ఎక్స్పో 2030 రియాద్ కంపెనీని ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా ఎక్స్పో 2030 రియాద్ కోసం కంపెనీ సౌకర్యాలను నిర్మించి, నిర్వహిస్తుంది. రియాద్ ఎక్స్పో 2030 కోసం రియాద్‌కు ఉత్తరాన 6 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ వేశారు. ఇది ఎగ్జిబిషన్ చరిత్రలో అతిపెద్ద ఎక్స్పో సైట్లలో ఒకటిగా ఉంటుందని, ఇది అనేక కీలకమైన ప్రముఖ ప్రదేశాలకు నేరుగా అనుసంధానించబడి ఉంటుందని తెలిపారు.
ఎక్స్పో 2030 రియాద్ 40 మిలియన్లకు పైగా సందర్శనలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత, కంపెనీ ఈ ప్రదర్శనను ఒక ప్రపంచ గ్రామంగా, రిటైల్ , ఫుడ్, సాంస్కృతిక కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఇది భవిష్యత్ లో ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.
సౌదీ అరేబియాలో ఆర్థిక పెట్టుబడులను సృష్టించడానికి, స్థిరమైన రాబడిని నిర్ధారించడానికి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పనిచేస్తుందని PIFలోని స్థానిక రియల్ ఎస్టేట్ పెట్టుబడి విభాగం అధిపతి సాద్ అల్క్రౌడ్ తెలిపారు. ఎక్స్పో 2030 రియాద్ అక్టోబర్ 1, 2030 నుండి మార్చి 31, 2031 వరకు జరుగుతుంది. అంతర్జాతీయ వ్యాపారాలకు కేంద్రంగా మారుతుందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధానులలో ఒకటిగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!