ట్రావెల్ బీమా యుద్ధం, సంఘర్షణలను కవర్ చేస్తుందా?
- June 20, 2025
యూఏఈ: మిడిలీస్ట్ లో తలెత్తిన ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా ట్రావెల్ బీమా కోసం డిమాండ్ పెరగడానికి దోహదపడ్డది. ఆకస్మిక పరిస్థితుల నుండి రక్షణ కోసం అనేక మంది ట్రావెల్ బీమాను తీసుకుంటున్నారని ఒక భీమా సంస్థ తెలిపింది.యూఏఈ విమానయాన సంస్థలు ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇరాన్, ఇజ్రాయెల్‌తో సహా అనేక గమ్యస్థానాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. కానీ, యూఏఈ నుండి కొంతమంది ప్రయాణికులు చివరి నిమిషంలో తమ గమ్యస్థానాలను మార్చుకున్నారు. మరికొందరు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయబడిన విమాన మార్గాల ప్రభావం లేని దేశాలను ఎంచుకున్నారు.
అయినప్పటికీ, చాలా మంది ఎమిరాటీలు, ప్రవాసులు ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే, చాలా ప్రామాణిక ప్రయాణ బీమా పాలసీలు భౌగోళిక-రాజకీయ అశాంతి లేదా సైనిక సంఘర్షణలకు క్లెయిమ్‌లను కవర్ చేయవని తెలుసుకోవాలని ఏజెంట్లు చెబుతున్నారు.
http://Policybazaar.aeలో జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తోషితా చౌహాన్ మాట్లాడుతూ.. "భౌగోళిక-రాజకీయ అశాంతి లేదా సైనిక సంఘర్షణ నుండి నేరుగా తలెత్తే ప్రమాదాలకు క్లెయిమ్‌లు సాధారణ పాలసీ నిబంధనల కింద మినహాయించారని తెలిపారు. "సామాను నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రయాణ ఆలస్యం, రద్దులకు వ్యతిరేకంగా ఆర్థిక రక్షణను అందిస్తుంది. కానీ ఇతర విషయాల్లో పరిహారం అందించదు" అని తెలిపారు. ప్రతి దేశం పర్యాటకులకు ప్రయాణ బీమాను తప్పనిసరి చేయకపోయినా, స్కెంజెన్ జోన్‌లోని దేశాలు, వైద్య అత్యవసర పరిస్థితుల కోసం ప్రయాణికులకు కనీస కవరేజ్ €30,000 (Dh126,387) కలిగి ఉండాలని చెబుతున్నాయని చౌహాన్ అన్నారు. అదేవిధంగా, థాయిలాండ్, టర్కీ మరియు కొన్ని గల్ఫ్ దేశాలు వంటి గమ్యస్థానాలు నిర్దిష్ట వీసా వర్గాలకు తప్పనిసరి ప్రయాణ బీమా పాలసీలను ప్రవేశపెట్టాయని తెలిపారు. ప్రయాణ బీమా అటువంటి ఖర్చులకు వ్యతిరేకంగా సమగ్ర రక్షణను అందిస్తుందన్నారు. వీటిలో అత్యవసర వైద్య చికిత్స, ట్రిప్ రద్దు, సామాను నష్టం, విమాన ఆలస్యం వంటివి ఉన్నాయని తెలిపారు.
ఇటీవలి ఇజ్రాయెల్-ఇరాన్ క్షిపణి దాడులు జరగక ముందే, యూఏఈలో ప్రయాణ బీమా ప్రీమియంలు రెండంకెల రేటుతో పెరిగాయి. ముఖ్యంగా యూరప్ వెళ్లే ప్రయాణికులకు, గరిష్ట అవుట్‌బౌండ్ ప్రయాణ సీజన్‌కు ముందు బీమా ప్రిమియంలు పెరిగాయి. పాలసీబజార్ యూఏఈ ప్రకారం, ప్రయాణ బీమా ప్రీమియంలు 12 శాతం పెరిగాయి.
సంవత్సరానికి శాతం నుండి 18 శాతం వరకు ప్రిమియం పెరిగింది. వెళ్లే దేశం, ప్రయాణికుల వయస్సు ఆధారంగా పాలసీకి Dh15 నుండి Dh70 వరకు పెరుగుతుందని http://Insurancemarket.ae డిప్యూటీ సీఈఓ అయిన హితేష్ మోత్వానీ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







