ఆత్మాహుతి దాడులతో వణికిపోతున్న ఇరాక్‌..

- July 13, 2016 , by Maagulf
ఆత్మాహుతి దాడులతో వణికిపోతున్న ఇరాక్‌..

ఇటీవల ఇరాక్‌ వరుస ఆత్మాహుతి దాడులతో వణికిపోతోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇరాక్‌లో ఉగ్రవాదులు విపరీతంగా దాడులకు తెగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుస దాడులు చేస్తున్న ఉగ్రవాదులు ఈరోజు బాగ్దాద్‌ జిల్లాలోని ఓ పోలీస్‌ చెక్‌పాయింట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పౌరులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. పేలుడు పదార్థాలు నిండిన కారుతో చెక్‌పోస్ట్‌లోకి దూసుకొచ్చి పేల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఓ మార్కెట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోయారు. ఇరాక్‌లో గత నెలలో జరిగిన దాడుల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com