రష్యన్ ఫేడరేషన్ ప్రాసిక్యూటర్ తో సౌదీ అటార్నీ జనరల్ సమావేశం..!!

- June 20, 2025 , by Maagulf
రష్యన్ ఫేడరేషన్ ప్రాసిక్యూటర్ తో సౌదీ అటార్నీ జనరల్ సమావేశం..!!

సెయింట్ పీటర్స్‌బర్గ్: అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్-ముజాబ్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యన్ ఫెడరేషన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ విక్టోరోవిచ్ క్రాస్నోవ్‌తో సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య సహకారం, న్యాయ రంగాలలో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి, చట్టపరమైన సంస్కృతి, నేరాలను ఎదుర్కోవడంలో.. న్యాయాన్ని సాధించే ప్రయాత్నాలపై సమీక్షించారు. 

ఈ పర్యటన సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్, రష్యన్ ఫెడరేషన్‌ మధ్య బలమైన సంబంధాలను విస్తరిస్తుందన్నారు. న్యాయపరమైన విషయాలలో ఉమ్మడి ప్రయోజనాలను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు.  

2019లో రెండు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో 2023-2024లో సహకార కార్యక్రమానికి పునాది పడింది.   సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, దేశాలు- సంస్థల మధ్య భాగస్వామ్య విలువలను పెంచడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com