నేషనల్ మ్యూజియంలో “నియో-రష్యన్ స్టైల్” ఎగ్జిబిషన్..!!
- June 20, 2025
మస్కట్: "ది రష్యన్ సీజన్స్" లో భాగంగా నేషనల్ మ్యూజియం.. స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియం సహకారంతో నిర్వహిస్తున్న "నియో-రష్యన్ స్టైల్" ప్రదర్శనను వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్ ప్రారంభించారు. నవంబర్ 2వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. అనేక దశాబ్దాల క్రితం ఏర్పడిన కళలో "రష్యన్ శైలి"ని తెలియజేయనున్నారు. 1880లు - 1910లలో రష్యన్ సామ్రాజ్యం కళాత్మక జీవిత చరిత్రలో భాగమైన వస్తువులు, చరిత్ర, సాంస్కృతికి ఆనవాళ్లను ప్రదర్శనకు పెట్టారు. రష్యన్ చివరి చక్రవర్తులు అలెగ్జాండర్ III, నికోలస్ II పాలనలో నియో-రష్యన్ శైలి లక్షణాలు మాస్కోలోని సెయింట్ పీటర్స్బర్గ్, రష్యాలోని పెద్ద -చిన్న ప్రాంతీయ పట్టణాల నిర్మాణంలో, పెయింటింగ్, శిల్పాలు, అలంకార, కళలు, రచనలలో భాగమైంది.
నేషనల్ మ్యూజియం సెక్రటరీ జనరల్ జమాల్ హసన్ అల్ మూసావి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం రష్యన్ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జరుగుతుందన్నారు. సాంస్కృతిక దౌత్యంలో భాగంగా రష్యన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఒమాన్ సుల్తానేట్లో రష్యన్ ఫెడరేషన్ రాయబారి ఒలేగ్ వ్లాదిమిరోవిచ్ లెవిన్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన 19వ శతాబ్దం చివరి, 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యన్ సంస్కృతి కాలంలోని అంశాలను తెలియజేస్తుందన్నారు. రష్యన్ ఫెడరేషన్ -ఒమన్ సుల్తానేట్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ ప్రదర్శన ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







