ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇస్లామిక్ కౌన్సిల్ ప్రకటన..!!

- June 20, 2025 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇస్లామిక్ కౌన్సిల్ ప్రకటన..!!

మనామా: ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫైర్స్ (SCIA) కోరింది. అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఐక్యత, సామాజిక స్థిరత్వం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా కౌన్సిల్ తెలియజేసింది.  ఆలోచనాత్మక ప్రవర్తనను కలిగి ఉండాలని, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలని తెలిపింది. కమ్యూనిటీ మధ్య విభజనను ప్రేరేపించే పుకార్లు లేదా వాట్పాప్ మేసేజులకు స్పందించవద్దని, అలాంటి వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ఇస్లామిక్ కౌన్సిల్ సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com