ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం..కొత్త బడ్జెట్ ట్రావెల్ ట్రెండ్స్..!!
- June 21, 2025
యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్తగా బడ్జెట్ ట్రావెల్ ట్రెండ్స్ వెలుగులోకి వచ్చాయి.చాలా మంది యూఏఈ నివాసితులు జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ వంటి దేశాలకు తమ వేసవి సెలవులను రద్దు చేసుకున్నారు. కానీ ఈ మార్పు ఆగ్నేయాసియా , దూర ప్రాచ్య దేశాలకు ఆసక్తిని పెంచడంతో కొత్త బడ్జెట్ ప్రయాణ ధోరణులకు తెరతీసిందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
“థాయిలాండ్, వియత్నాం, లావోస్, చైనా, జపాన్, శ్రీలంక వంటి గమ్యస్థానాలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతోంది.” అని వైజ్‌ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ అన్నారు. “ప్రయాణికులు ఇప్పుడు తూర్పు వైపు చూస్తున్నారు. చాలామంది సమ్మర్ లో విశ్రాంతిని చల్లచల్లగా ఆస్వాదించాలనుకుంటున్నారు.” అని తెలిపారు. ఈ సంవత్సరం భారతదేశం , శ్రీలంక అత్యంత ఇష్టమైన ప్రదేశాలుగా నిలుస్తున్నాయని సుబైర్ తెలిపారు.
“కేరళలోని వర్షంతో తడిసిన పచ్చదనం, హిమాచల్‌లోని కొండ ప్రాంతాలు లేదా శ్రీలంకలోని టీ ఎస్టేట్లలో సమయం గడపడానికి ప్రజలు ఎంచుకుంటున్నారు. ఇది వేరే రకమైన అనుభవం, ప్రశాంతత, చల్లదనం, ఉత్తేజకరమైనది.” అని పేర్కొన్నారు.
ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని మాట్లాడుతూ..ఈ ట్రెండ్ ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికన్ ప్రాంతాలకు కూడా మారుతోందని అన్నారు.“జార్జియా, సమీప దేశాలకు ప్రయాణాలను రద్దు చేసిన తర్వాత, చాలా మంది నివాసితులు ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు తిరిగి బుక్ చేసుకుంటున్నారు.ఈ ప్రదేశాలు డబ్బుకు గొప్ప విలువ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా ఎంపికలు అందిస్తాయి.” అని తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







