ఇరాన్‌పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా

- June 22, 2025 , by Maagulf
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా

ఇస్తాంబుల్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడటం స్పష్టమైన దురాక్రమణ అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది.  దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ భద్రతకు ఇది విఘాతం కలిగించిందని తెలిపారు.  ఇస్తాంబుల్‌లో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) 51వ కౌన్సిల్ ఆఫ్ విదేశాంగ మంత్రుల ప్రారంభ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సౌదీ వైఖరిని వివరించారు.

సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని, ఉద్రిక్తతను నివారించాలని అన్ని పార్టీలను ఆయన కోరారు.  ఇరాన్.. అంతర్జాతీయ సమాజం మధ్య దౌత్య చర్చలకు తిరిగి రావాల్సిన అవసరాన్ని వివరించారు. పాలస్తీనా సమస్య పట్ల సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందని ప్రిన్స్ ఫైసల్ పునరుద్ఘాటించారు.  

గాజాలో సంక్షోభాన్ని అరికట్టడానికి, దిగజారుతున్న మానవతా పరిస్థితిని పరిష్కరించడానికి..  పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి రాజ్యం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. "1967 సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలేం రాజధానిగా తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి పాలస్తీనా ప్రజల హక్కుకు తాము ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. వారికి సౌదీ అండగా నిలుస్తుంది." అని ఆయన అన్నారు. ఈ అంశంపై అరబ్, ఇస్లామిక్ ఐక్యత కోసం సౌదీ అరేబియా కృషి చేస్తోందని ఆయన అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com