అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- June 24, 2025
దోహా, ఖతార్: అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తన X ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఖతార్ రాష్ట్ర సార్వభౌమాధికారం, దాని గగనతలం, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా..నేరుగా స్పందించే హక్కు ఖతార్‌కు ఉందన్నారు.
ఖతార్ వైమానిక రక్షణ దళాలు ఇరాన్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ఇరానియన్ క్షిపణులతో నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఇటువంటి తీవ్రతరమైన సైనిక చర్యలు కొనసాగడం వల్ల ఈ ప్రాంతంలో భద్రత దెబ్బతింటుందని, అంతర్జాతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతుందని తెలిపారు. అన్ని సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని, వెంటనే దౌత్య మార్గంలో చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







