విద్యుత్, నీటి ప్రాజెక్టులపై కువైట్ ప్రధాన మంత్రి సమీక్ష..!!

- June 24, 2025 , by Maagulf
విద్యుత్, నీటి ప్రాజెక్టులపై కువైట్ ప్రధాన మంత్రి సమీక్ష..!!

కువైట్: వ్యూహాత్మక ఇంధనం,  నీటి డీశాలినేషన్ ప్రాజెక్టులపై తాజా డెవలప్ మెంట్ పై బయాన్ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా సమీక్షించారు. షాగయా, అల్-అబ్దాలియా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, అలాగే అల్-జోర్ నార్త్ (దశ 1 , 2), అల్-ఖిరాన్ ఫేజ్ 1, అల్-నువైసీబ్ ఫేజ్ 1, సుబియా విస్తరణ విద్యుత్ ప్లాంట్లు వంటి కీలకమైన భవిష్యత్ వెంచర్లపై చర్చించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అడ్డంకులను అధిగమించాలని సూచించారు. 

ఈ సమావేశంలో ప్రధానమంత్రి దివాన్ అధిపతి అబ్దులాజీజ్ అల్-దఖీల్, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రి డాక్టర్ సుబైహ్ అల్-ముఖైజిమ్, మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com