సౌదీలో గ్రోసరీ స్టోర్లలో టోబాకో, మీట్, ఫ్రూట్స్, వెజ్జిస్ సేల్స్ పై నిషేధం..!!

- June 24, 2025 , by Maagulf
సౌదీలో గ్రోసరీ స్టోర్లలో టోబాకో, మీట్, ఫ్రూట్స్, వెజ్జిస్ సేల్స్ పై నిషేధం..!!

రియాద్: గ్రోసరీ స్టోర్లలో (బకాలాస్) పొగాకు, ఖర్జూరం, మాంసం, పండ్లు, కూరగాయలను అమ్మకుండా సౌదీ అరేబియా నిషేధించింది. ఈ మేరకు మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రి మజేద్ అల్-హోగైల్ కొత్త నిబంధనలను జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందన్నారు. అయితే, ఇప్పటికే ఉన్న సంస్థలకు ఇప్పటి నుండి ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి మంజూరు చేయబడుతుందని తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం.. కియోస్క్‌లు, కిరాణా దుకాణాలు లేదా మినీ మార్కెట్‌లు ఇకపై ఖర్జూరం, మాంసం, పండ్లు, కూరగాయలు.. అలాగే సాధారణ, ఎలక్ట్రానిక్ సిగరెట్లు, షిషాతో సహా పొగాకు ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతించరు. మాంసం అమ్మకానికి ప్రత్యేక లైసెన్స్ అవసరమనే షరతుతో ఈ ఉత్పత్తులన్నింటినీ సరఫరా దుకాణాలలో (సూపర్ మార్కెట్లు) విక్రయించడానికి అనుమతిస్తారు.  సవరించిన నిబంధనలు ఈ ఉత్పత్తులన్నింటినీ హైపర్ మార్కెట్లలో విక్రయించడానికి అనుమతినిస్తున్నాయి. ఈ సవరణలు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు,  హైపర్ మార్కెట్లలో ఛార్జర్ కేబుల్స్, ప్రీపెయిడ్ రీఛార్జ్ కార్డుల అమ్మకాన్ని కూడా అనుమతించనున్నాయని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com