E311 వద్ద 2 నెలల ట్రాఫిక్ ఆంక్షలు..దుబాయ్ ఆర్టీఏ
- June 27, 2025
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) లోని అల్ బరారి అండర్‌పాస్ వద్ద జూన్ 28నుండి ట్రాఫిక్ మళ్లింపు (ఆంక్షలు) ప్రారంభం అవుతుందని దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రెండు నెలల పాటు ఈ మళ్లింపు కొనసాగుతుందని తెలిపింది. వర్షపు నీరు, భూగర్భ నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరచడానికి, అలాగే ఈ ప్రాంతంలో రోడ్డు పునరుద్ధరణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
వాహనదారులు దుబాయ్-అల్ ఐన్ వంతెన (జెబెల్ అలీ వైపు U-టర్న్) లేదా గ్లోబల్ విలేజ్ అండర్‌పాస్, ఉమ్ సుకీమ్ స్ట్రీట్ కూడలి (షార్జా వైపు U-టర్న్) లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
మరోవైపు, షార్జాలో రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (SRTA) అల్ ఇంతిఫాదా స్ట్రీట్ నుండి అల్ కార్నిచ్ స్ట్రీట్ వరకు రోడ్డును మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూసివేత జూలై 27 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్ మొదటి దశ పనులు జరుగుతాయని వెల్లడించింది.
అలాగే, అబుదాబిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. జూన్ 30 వరకు సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్‌లో పాక్షికంగా ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ స్ట్రీట్ నుండి షేఖా ఫాతిమా బింట్ ముబారక్ స్ట్రీట్‌కు ఫ్రీ రైట్ టర్న్ జూన్ 30న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా