కువైట్ లో డ్రగ్ నిరోధక ఆపరేషన్..భారీగా కాప్టాగన్ పిల్స్ సీజ్..!!
- June 27, 2025
కువైట్: డ్రగ్ సరఫరా, వినియోగదారులపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. స్పెషల్ ఆఫరేషన్ సందర్భంగా జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ డ్రగ్ కంట్రోల్ సుమారు ఒక మిలియన్ కాప్టాగన్ మాత్రలను స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్య పదార్థాల అక్రమ రవాణా, పంపిణీలో పాల్గొన్న అనుమానితుడి గురించి అధికారులకు ఖచ్చితమైన సమాచారం అందడంతో తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతను చట్టవిరుద్ధంగా కువైట్ పౌరసత్వం పొందాడని గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాదకద్రవ్య నియంత్రణ విభాగం, జాతీయత వ్యవహారాల దర్యాప్తు విభాగం నుండి సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా