దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ ప్రారంభం..30 గోల్డ్ బార్స్, 9 కొత్త కార్లు..!!

- June 28, 2025 , by Maagulf
దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ ప్రారంభం..30 గోల్డ్ బార్స్, 9 కొత్త కార్లు..!!

దుబాయ్: దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (DSS) 28వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ ఎడిషన్ జూన్ 27 నుండి ఆగస్టు 31 వరకు 66 రోజుల పాటు కొనసాగనుంది. జూలై 17 వరకు వేసవి కాలం పాటు జరిగే DSS సేల్స్ సీజన్‌లో భాగంగా 9 వారాల అద్భుతమైన ప్రమోషన్లు, ప్రత్యేకమైన ఇన్-స్టోర్ ఆఫర్‌లను అందజేస్తున్నారు. దుకాణదారులు 800 కంటే ఎక్కువ బ్రాండ్‌లు, 3,000 కంటే ఎక్కువ స్టోర్‌లలో 75 శాతం వరకు తగ్గింపులను ప్రకటించారు.  

గోల్డ్ బార్స్, కార్లు
జూన్ 27 నుండి ఆగస్టు 31 వరకు తొమ్మిది బ్రాండ్-న్యూ కార్ల కీలను అందించే దుబాయ్ షాపింగ్ మాల్స్ గ్రూప్ DSS రాఫెల్; జూన్ 27 నుండి ఆగస్టు 30 వరకు 30 మంది విజేతలకు 30 బంగారు కడ్డీలను అందించే దుబాయ్ గోల్డ్ & జ్యువెలరీ గ్రూప్ రాఫెల్స్;  జూన్ 27 నుండి ఆగస్టు 30 వరకు వీసా జ్యువెలరీ ప్రోగ్రామ్, 50 మంది విజేతలు ఆభరణాల వోచర్లలో Dh175,000 వాటాను అందుకుంటారు.  

సమ్మర్ రెస్టారెంట్ వీక్ జూలై 4 నుండి 13 వరకు దుబాయ్‌లోని అత్యంత ప్రియమైన రెస్టారెంట్లు డైనర్లను ఆహ్వానిస్తుంది. Dh95 ధరకు రెండు-కోర్సు భోజనాలు,  Dh150 ధరకు మూడు-కోర్సు ఫుడ్ ను ఆఫర్ చేస్తున్నారు.

DSS ఎంటర్‌టైనర్ 2025కి ప్రీమియం, క్యాజువల్ డైనింగ్, బ్రంచ్‌లు, డెలివరీ, ఆకర్షణలు, విశ్రాంతి, స్పాలు, సెలూన్‌లు, ఫిట్‌నెస్, మరిన్నింటిలో 7,500 కంటే ఎక్కువ బై వన్ గెట్ వన్ ఉచిత ఆఫర్‌లను అందజేస్తున్నారు.

జూన్ 27న దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ జపనీస్ నృత్య బృందం సబ్రినా,  పాలస్తీనియన్-జోర్డాన్ పాప్ కళాకారిణి రీనా ఖౌరీ ప్రదర్శనలు ఉంటాయి.అలాగే,  అబ్రి & ది బ్యాండ్ మరియు గాయకుడు-గేయ రచయిత నోయెల్ ఖర్మాన్ జూన్ 28న ఉంటుంది.  సిటీ సెంటర్ మిర్డిఫ్‌లో, సిరియన్ గాయకుడు అల్ షామి మరియు జోర్డానియన్ ఇండీ రాక్ బ్యాండ్ జాదల్ జూన్ 28న కాన్సర్ట్ ఇవ్వనున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com