ఒమన్ 'ధమానీ'ప్లాట్‌ఫామ్..ఆరోగ్య బీమాలో విప్లవాత్మక మార్పులు..!!
- June 28, 2025
మస్కట్: జాతీయ ఆరోగ్య బీమా ప్లాట్‌ఫామ్ “ధమానీ” 2025 మొదటి అర్ధభాగానికి తన కార్యాచరణ నివేదికను విడుదల చేసింది. ఇది ఒమన్ సుల్తానేట్ అంతటా ఆరోగ్య బీమా సేవల పెరుగుదలను వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం..ప్లాట్‌ఫామ్ 4.2 మిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. సగటున రోజుకు 40,000 లావాదేవీలు జరిగాయి. వీటిలో 2.3 మిలియన్లు బీమా చేయబడిన వ్యక్తుల కోసం అర్హత ధృవీకరణల జారీ, 1.4 మిలియన్లు వైద్య ఆమోదాలు, 700,000 క్లెయిమ్‌లు ఆసుపత్రులు సమర్పించాయి.
ఒక ముఖ్యమైన మైలురాయిలో 3.5 మిలియన్ రియాల్స్‌ను బీమా కంపెనీల నుండి ఆసుపత్రులకు ఎలక్ట్రానిక్‌గా బదిలీ చేశారు. ఇది ఆర్థిక పరిష్కారాలలో పారదర్శకత అని అధికారులు తెలిపారు.
ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్‌లో ఇప్పుడు 33 ఆసుపత్రులు, 37 ఆరోగ్య సముదాయాలు, 33 ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, 20 క్లినిక్‌లు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా