ఫహాహీల్ సిగ్నల్ దగ్గర 10 రోజుల పాటు రోడ్డు మూసివేత..!!
- June 28, 2025
కువైట్: ఫహాహీల్ ప్రాంతంలోని కీలక రహదారులను నిర్వహణ పనుల కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజాము నుండి, సబాహియా నుండి ఫహాహీల్ రౌండ్‌అబౌట్ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం "ఫహాహీల్ క్లబ్ ఇంటర్‌సెక్షన్" మూసివేయబడుతుంది. దాంతోపాటు సబాహియా దిశలో "రోడ్ 30" నుండి కువైట్ సిటీ వైపు వెళ్లే రహదారి కూడా మూసివేయబడుతుందని ప్రకటించారు. నిర్వహణ, మెరుగుదల పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా