నవీన్ చంద్ర ఇప్పుడు విలన్‌గా ...

- July 14, 2016 , by Maagulf
నవీన్ చంద్ర ఇప్పుడు విలన్‌గా ...

నేటి తరం హీరోలు పాత్ర కోసం పరితపిస్తున్నారే తప్ప.. ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని ఏ మాత్రం ఆలోచించడం లేదు. అందుకే హీరోలు విలన్ లుగా దర్శనమిస్తున్నారు. కొందరేమో సపోర్టింగ్ పాత్రలలో నటించి మెప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న సరైనోడు చిత్రంలో బన్నీకి ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి నటించగా, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆది పర్‌ఫార్మెన్స్‌పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా నానికి విలన్‌గా నటించేందుకు పవర్‌ఫుల్ హీరో రెడీ అయ్యాడు.అందాల రాక్షసి, త్రిపుర, లచ్చిందేవికి ఓ లెక్కుంది లాంటి పలు చిత్రాలతో తెలుగు వారి దృష్టిని ఆకర్షించిన నవీన్ చంద్ర ఇప్పుడు విలన్‌గా మారబోతున్నట్టు తెలుస్తోంది. నాని త్వరలో సినిమా చూపిస్త మావ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనుండగా, ఆ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు నవీన్ చంద్ర అయితే బాగుంటుందని యూనిట్ భావించిందట. వెంటనే ఆయనను సంప్రదించగా కథ నవీన్‌కి కనెక్ట్ కావడం, విలన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో మరేమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో నేనే శైలజ ఫేం కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు టాక్. నాని ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, ఈ మూవీ తరువాత త్రినాధరావు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com