జులై 1న రా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న పరాగ్ జైన్
- June 29, 2025
న్యూ ఢిల్లీ: ‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (RAW) చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్‌గా పరాగ్ జైన్‌ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న పరాగ్ జైన్ రా చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.
కీలక పాత్ర
పరాగ్ జైన్.. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. పాకిస్థాన్‌పై ఇటీవలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.
ఎందుకు ఈ నియామకం ముఖ్యమైనది?
పరాగ్ జైన్ నేతృత్వంలో ARC‑R&AW సంయుక్తంగా పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను గుర్తించి దాడులకు కీలక సహాయం చేశారు .భారత–పాక్ సరిహద్దు, J&Kలో అత్యంత కీలక పరిస్థితుల్లో అనుభవం కలిగిన నాయకుడు. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితులకు తగ్గవిధంగా ఉంది .హ్యూమెంట్ & టెక్నిక్ ఇంటెలిజెన్స్‌ను సమతుల్యంగా వినియోగించే నైపుణ్యంతో, సమగ్ర గూఢచర్యా విధానం రూపొందించేందుకు వీలు కలుగుతుంది .
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







