పాక్ పై భారత్ తీవ్ర విమర్శలు..

- July 14, 2016 , by Maagulf
పాక్ పై భారత్ తీవ్ర విమర్శలు..

పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పొగుడుతోందని భారత్‌ పాక్‌పై ఎదురుదాడికి దిగింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వానిని భారత భద్రతాదళాలు మట్టుబెట్టిన అంశాన్ని పాకిస్థాన్‌ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తడంపై భారత్‌ పాక్‌ను తీవ్రంగా విమర్శిస్తోంది. పాక్‌ ఉగ్రవాదులపై ప్రశంసలు కురిపిస్తోందని.. ఉగ్రవాదాన్ని దేశ పాలసీగా పెట్టుకుని, ఇతర దేశాల భూభాగాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భారత్‌ పేర్కొంది. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో నిన్న మానవ హక్కుల అంశంపై జరిగిన చర్చలో పాక్‌ రాయబారి మలీహా లోధి ఉగ్రవాది బుర్హాన్‌ అంశం లేవనెత్తడంపై ఐరాసలో భారత రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఘాటుగా స్పందించారు.
లోధి ప్రకటనలో బుర్హాన్‌ను కశ్మీరీ నేతగా అభివర్ణించడంపై భారత్‌ మండిపడింది. కశ్మీర్‌లో కల్లోల పరిస్థితులతో పాటు ఆమె కశ్మీరీ నేత అయిన బుర్హాన్‌ను న్యాయాధికార పరిధులను అతిక్రమించి భారత భద్రతాదళాలు హతమార్చాయని లోధి పేర్కొన్నారు. దీంతో పాక్‌ ఉగ్రవాదులను ప్రశంసిస్తోందంటూ అక్బరుద్దీన్‌ ప్రకటనలో తెలిపారు. ఐరాస వేదికను పాకిస్థాన్‌ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగిన అంశమన్నారు.
పాక్‌ హైకమిషనర్‌కు సమన్లు పంపనున్న భారత్‌ బుర్హాన్‌ వాని అంశంలో భారత్‌ పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు సమన్లు పంపనుంది. బుర్హాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరనుంది. జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ఇప్పటికే బుర్హాన్‌పై ఉన్న పలు కేసులకు సంబంధించి వివరాలు హోంమంత్రిత్వ శాఖకు పంపించింది. అతడిపై 12 ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com