ఘనంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి
- June 29, 2025
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కళాలలిత కళావేదికలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి సందర్భంగా, గాయకుడు వీఆర్కే ఫణి నిర్వహణలో "నేనొక పూల మొక్కకడ నిల్చి" ప్రైవేట్ గీతాల ప్రత్యేక కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించబడింది.
ప్రధాన గాయకుడైన ఫణిని,ఘంటసాల స్వర్ణపతకంతో వంశీ రామరాజు మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేఖ మూర్తి దివాకర్ల సత్కరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ ఆదినారాయణ, రవీంద్ర, నిషీజా రమణి, హృషీకేశ్, ఘంటసాల వెంకటేశ్వర రావులను సురేఖ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వంశీ ప్రెసిడెంట్ సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజ పాల్గొన్నారు.
వంశీ రామరాజు ప్రసంగిస్తూ, తమకు కరుణశ్రీ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
"వారు పుట్టిన ఊరులోనే నేను పుట్టాను" అని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో కరుణశ్రీ కుటుంబ సభ్యులు వీక్షించడం తమకు ఆనందం కలిగించిందని వంశీ రామరాజు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







