'ఆంధ్రా కింగ్ తాలూకా' కొత్త షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభం
- June 29, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
తాజా షూటింగ్ షెడ్యూల్ ఈరోజు రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్ పోతినే, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్ గా పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. టాప్ టెక్నిషియన్స్ తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా పని చ్దేస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్ తుమ్మల.
ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్
సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి.
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ - మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :హరీష్ తుమ్మల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా