హిమ్యాన్ కార్డ్ హోల్డర్లకు ఆపీల్ పే: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- June 29, 2025
దోహా, ఖతార్: థర్డ్ ఫైనాన్షియల్ సెక్టార్ స్ట్రాటజీ, థర్డ్ నేషనల్ డెవలప్‌మెంట్ స్ట్రాటజీ 2024-2030కి అనుగుణంగా ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB).. ఖతార్‌లోని తన హిమ్యాన్ కార్డ్ హోల్డర్లకు ఆపిల్ పే (Apple Pay)ని తీసుకువస్తుంది. Apple Pay అనేది స్టోర్ లలో, యాప్‌లలో..ఆన్‌లైన్‌లో చెల్లించడానికి సులభమైన, సురక్షితమైన మార్గమన్నారు.
స్టోర్ లలో చెల్లించడానికి, కస్టమర్‌లు సైడ్ బటన్‌ను డబుల్-క్లిక్ చేసి, కాంటాక్ట్‌లెస్ చెల్లింపు చేయడానికి చెల్లింపు టెర్మినల్ దగ్గర వారి iPhone లేదా Apple వాచ్‌ను ఎంచుకోవాలని QCB తెలిపింది. ప్రతి Apple Pay కొనుగోలు సురక్షితమని, ఇది ఫేస్ ID, టచ్ ID లేదా పరికర పాస్‌కోడ్‌తో పాటు వన్-టైమ్ యూనిక్ డైనమిక్ సెక్యూరిటీ కోడ్‌తో మాత్రమే పనిచేస్తుందని తెలిపింది.
కిరాణా దుకాణాలు, ఫార్మసీలు, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, రిటైల్ దుకాణాలు, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను అంగీకరించే అనేక ఇతర ప్రదేశాలలో ఆపిల్ పే ఆమోదించబడుతుందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ షేక్ అహ్మద్ బిన్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్-థాని వెల్లడించారు. కమ్యూనిటీలోని ప్రతి సభ్యునికి బ్యాంకింగ్ సేవలను దగ్గరగా తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!